Samantha: సమంత బేబీ బంప్ ఫోటోలు వైరల్.. నిజమేనా?
టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చెన్నై సుందరి, 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన సమంత, మంచి ఫామ్‌లో ఉండగానే టాలీవుడ్ నటుడు నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే కొంతకాలం తర్వాత విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోల్లో ఆమె బేబీ బంప్‌తో కనిపించడమే అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించినవిగా తెలుస్తోంది.
ఏఐ సాయంతో సమంత బేబీ బంప్ ఫోటోలు
ఏఐ సాయంతో సమంత బేబీ బంప్ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో నాగచైతన్యతో విడాకుల తర్వాత మాతృత్వాన్ని అనుభవించాలని ఉందని సమంత చెప్పిన మాటలు ఇప్పుడు ఫోటోలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇక సినిమాల విషయానికొస్తే, సమంత గతేడాది శాకుంతలం, ఖుషి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే హిందీలో వరుణ్ ధవన్‌తో కలిసి సిటడెల్ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత సమంత నుంచి కొత్త సినిమా ప్రకటన రావాల్సి ఉంది.