Keerthy Suresh: 'సమంత వల్లే బాలీవుడ్ ఎంట్రీ'.. కీర్తి సురేశ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు, తమిళ చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి 'బేబీ జాన్' చిత్రంతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ఈ సినిమాలో అవకాశం రావడం గురించి కీర్తి తాజాగా స్పందిస్తూ, సమంతకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ చిత్రం సమంత నటించిన తమిళ చిత్రం 'తెరి'కి హిందీ రీమేక్. హిందీలో ఈ పాత్రకు తన పేరును సమంత సిఫార్సు చేసిందిని, ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు.
'తెరి'లో సమంత నటన తనకు ఎంతో ఇష్ట చాలా ఇష్టమన్నారు. ఆమె పాత్రను హిందీలో చేయడం తన జీవితంలో కీలక ఘట్టమని, బాలీవుడ్‌లో తన ఎంట్రీకి సమంత కారణమన్నారు.
Details
ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేశ్
చిత్రబృందం తన పేరును వెల్లడించినప్పుడు, ఆమె సందేశం తనకు ధైర్యం ఇచ్చిందని, అదే నమ్మకంతో చిత్రీకరణ పూర్తిచేశామని కీర్తి చెప్పారు.
కీర్తి సురేశ్, సమంత కలిసి 'మహానటి' చిత్రంలో కూడా నటించారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఆ చిత్రంలో కీర్తి సావిత్రిగా మెప్పించిన, సమంత జర్నలిస్ట్‌గా ఆకట్టుకున్నారు.
ఆ పాత్రకు గాను కీర్తి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
'బేబీ జాన్' విషయానికొస్తే, కాలీస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించగా, వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.