లాంగ్ బ్రేక్ కోసం సిద్ధమైపోయిన సమంత: ఈరోజు స్పెషల్ అంటూ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల నుండి కొన్ని రోజులు సమంత బ్రేక్ తీసుకోనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సంవత్సరం పాటు ఎలాంటి కొత్త సినిమాల జోలికి వెళ్ళకుండా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం పైనే సమంత దృష్టి పెట్టనుంది.
అయితే తాజాగా ఇన్స్ టా లో సమంత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. లాంగ్ బ్రేక్ కోసం సమంత పూర్తిగా సిద్ధమైపోయిందని ఇన్స్ టా పోస్ట్ తెలియజేస్తుంది.
సిటాడెల్ ఇండియన్ వెర్షన్ సిరీస్ లో నటిస్తున్న సమంత, తన భాగం షూటింగును పూర్తి చేసుకుంది. ఈ మేరకు సోషల్ అకౌంట్లో విషయాన్ని వెల్లడి చేసి, ఈరోజు తనకు ప్రత్యేకమని చెప్పుకొచ్చింది సమంత.
Details
ట్రీట్మెంట్ కోసం అమెరికాకు సమంత
ఇటు ఖుషి సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యిందని అంటున్నారు. దీంతో లాంగ్ బ్రేక్ కోసం సమంత రెడీ అయినట్లే అని సమాచారం.
కొన్నిరోజుల క్రితం సమంత ఆటో ఇమ్యూన్ డిసీజ్ మయోసైటిస్ బారిన పడింది. యశోద సినిమా సమయంలో అటు ట్రీట్మెంట్ జరుగుతుండగా సినిమా పనులను పూర్తి చేసింది సమంత.
మయోసైటిస్ ఇంకా పూర్తిగా తగ్గకుండానే శాకుంతలం, ఖుషి, సిటాడెల్ షూటింగులకు సమంత వచ్చేసింది.
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల షూటింగులు పూర్తయిపోవడంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళనుందని అంటున్నారు.
అదలా ఉంచితే ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. సిటాడెల్ ఎప్పుడు విడుదల అవుతుందనేది క్లారిటీ లేదు.