వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100
సినిమా సెలెబ్రిటీల చదువు గురించి తెలుసుకోవాలని అభిమానులకు ఆసక్తిగా ఉంటుంది. వెండితెర మీద వందకు వంద మార్కులు తెచ్చుకునే స్టార్స్, స్కూల్ సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు తెచ్చుకునేవారో తెలుసుకోవాలని ఉత్సాహ పడతారు. అలా ఉత్సాహపడే వారు సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్టును ఒకసారి చూడాల్సిందే. ప్రస్తుతం ఇంటర్నెట్ లో సమంత టెన్త్ క్లాస్ రిపోర్ట్, వైరల్ గా మారుతోంది. సీఎస్ఐ సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో 2001-2002లో పదవ తరగతి చదివిన సమంత, అన్ని సబ్జెక్టుల్లో 1000మార్కులకు గాను 887 మార్కులు సంపాదించింది. మ్యాథ్స్ లో 100కు 100మార్కులు తెచ్చుకుంది. ఇంకా ఫిజిక్స్ లో 95, ఇంగ్లీష్ లో 90, హిస్టరీలో 91 మార్కులు తెచ్చుకుంది
స్కూలుకు దొరికిన బంగారం
ప్రతీ సబ్జెక్టులో అత్యధిక మార్కులు తెచ్చుకుంది సమంత. స్కూల్ రోజుల్లో సమంత టాపర్ గా నిలిచేదని ఈ టెన్త్ క్లాస్ మార్కుల లిస్టు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, మార్కుల లిస్టులోని రిమార్కుల కాలంలో, సమంతను ఉద్దేశిస్తూ, స్కూలుకు దొరికిన బంగారం అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ రిపోర్టును చూసిన వారంతా సమంతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అదలా ఉంచితే ప్రస్తుతం సమంత, సిటాడెల్ వెబ్ సిరీస్, ఖుషీ సినిమాలో కనిపిస్తున్నారు. తాజాగా రిలీజైన శాకుంతలం బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావం చూపించకుండా సమంత కెరీర్లో డిజాస్టర్ గా మిగిలింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన శాకుంతలం సినిమాను, గుణశేఖర్ డైరెక్ట్ చేసారు.