Page Loader
Samantha: సమంత - రాజ్ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్..! 

Samantha: సమంత - రాజ్ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, ప్రముఖ నటి సమంత గురించి ఇటీవల కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇద్దరూ తరచూ కలసి కనిపించడంతో వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమంత తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. అమెరికా వెకేషన్‌కి వెళ్లిన సమంత,తన సన్నిహితులతో కలిసి దిగిన చిత్రాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అందులో దర్శకుడు రాజ్ నిడిమోరుతో దిగిన ఫొటోలు ప్రత్యేకంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.

వివరాలు 

'శుభం' చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌

ఫొటోలతో పాటు సమంత ఒక సూక్తిని కూడా పోస్ట్ చేసింది: ''మీరు అదృష్టవంతులు కారు.. మీ కష్టానికి ఫలితం వచ్చింది.'' అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఈ ఫోటోల్లో సమంత-రాజ్ చాలా దగ్గరగా కనిపించడంతో కొంతమంది అభిమానులు ''కంగ్రాట్స్'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే సమంత నటించిన 'ది ఫ్యామిలీమ్యాన్‌ 2', 'సిటడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్ట్స్‌కు రాజ్-డీకే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్స్ సమయంలోనే రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఇక తాజాగా సమంత నిర్మించిన 'శుభం' చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. వీటి ద్వారా ఇద్దరి మధ్య ఉన్న సన్నిహితత మరింత బలపడినట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ భరితమైన సందేశం 

తనపై వస్తోన్న పుకార్లకు స్పందనగా ఇటీవల సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ భరితమైన సందేశాన్ని పంచుకుంది. ''ఇతరుల మాటలను పట్టించుకోకుండా నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నించండి. ఏదైనా జరిగే ప్రక్రియను అడ్డుకోవాలన్న భావన శాంతిని చీలుస్తుంది. శాంతిని ఆస్వాదించాలి, దానితో పోరాడాల్సిన అవసరం లేదు. జరుగాల్సింది జరిగేలా ఉండే క్రమంలో మనం ముందుకు సాగాలి.'' అంటూ ఆమె పేర్కొంది.