
Samantha: సమంతకి గుడి కట్టిన వీరాభిమాని.. టెంపుల్ ఎక్కడుంది, ఎవరు కట్టారు?
ఈ వార్తాకథనం ఏంటి
అభిమానులు తమ అభిమాన తారలపై అపరిమితమైన ప్రేమను పెంచుకుంటారు.అయితే ప్రతి ఒక్కరు తమదైన శైలిలో ఆ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.
కొందరు పాలాభిషేకాలు చేస్తారు, మరికొందరు తమ స్టార్ పేరుతో దానాలు, ధర్మాలు నిర్వహిస్తారు.
అయితే, అభిమానం మరింతగా పెరిగినప్పుడు, కొందరు ఏకంగా గుడులు కట్టి పూజలు కూడా నిర్వహిస్తారు.
గతంలో తమిళనాడులో ఖుష్బు, నమిత వంటి హీరోయిన్‌లకు అభిమానులు గుడులు కట్టారు.
తమిళనాట సెలబ్రిటీలపై ప్రజలకు గాఢమైన అభిమాన భావాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అప్పట్లోనే వారికి గుడులు కట్టారు.
వివరాలు
బాపట్ల జిల్లా ఆలపాడులో సమంతకు గుడి
తెలుగు రాష్ట్రాల్లో అయితే స్టార్ హీరోలు, హీరోయిన్లకు గుడులు కట్టిన సందర్భాలు తక్కువ.
అయితే, తొలిసారి బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ అనే వ్యక్తి తన అభిమాన నటి సమంతకు గుడి కట్టి చరిత్ర సృష్టించాడు.
కార్ డ్రైవర్‌గా పని చేస్తున్న సందీప్, సమంతకు వీరాభిమాని. తన అభిమానాన్ని గుడి రూపంలో చూపిస్తూ, తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టి, రోజూ సమంతకు పూజలు చేస్తున్నాడట.
సమంత మంచి మనసుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో, ఆమె వ్యక్తిత్వానికి ముగ్ధుడై, తన అభిమానాన్ని గుడి రూపంలో నిలిపాడు.
వివరాలు
"ఏం మాయ చేసావే" అప్పటి నుంచే సమంతకు అభిమాని
సొంత డబ్బులతో సమంతకు గుడి కట్టడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో నటీనటులకు గుడులు కట్టిన దాఖలాలు లేవు. సమంత కోసం ఇలా గుడి ఏర్పాటు చేయడం ఆమె అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
సందీప్ 2010లో విడుదలైన"ఏం మాయ చేసావే" సినిమా చూసినప్పటి నుంచే సమంతకు వీరాభిమానిగా మారాడు.
అప్పటి నుంచి ఆమె సినిమాలను,ఆమె చేసే మంచి పనులను అనుసరిస్తూ వస్తున్నాడు.
సమంత "ప్రత్యూష ఫౌండేషన్" ద్వారా చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించడంలో చూపించిన సేవా తత్వం,ఇతర సేవా కార్యక్రమాలు చూసి ఫిదా అయిపోయాడు.
అందుకే తన అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలనే ఉద్దేశంతో సమంతకు గుడి కట్టాడు.2023లో సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ గుడిని అధికారికంగా ప్రారంభించాడు.
వివరాలు
స్వీయ నిర్మాణంలో సమంత సినిమా
ఇటీవల ఈ గుడికి సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు బయటకు వచ్చి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే, 'ఖుషి' చిత్రం తర్వాత సమంత కొత్త తెలుగు ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
ప్రస్తుతం ఆమె స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.