శాకుంతలం పోయినా సమంత పాపులారిటీ తగ్గలేదు, సాక్ష్యంగా నిలుస్తున్న IMDB ర్యాంకింగ్స్
సమంత నటించిన శాకుంతలం సినిమాకు ప్రేక్షకుల నుండీ నెగెటివ్ టాక్ వచ్చింది. సమంత కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన చిత్రానికి కనీస కలెక్షన్లు కూడా రాలేవు. ఈ నేపథ్యంలో సమంత పనైపోయిందని కామెంట్లు కూడా వినిపించాయి. తాజాగా రిలీజైన IMDB రేటింగ్స్ చూస్తే ఆ మాట మార్చుకోవాల్సి వస్తుందని సమంత అభిమానులు అంటున్నారు. ఎందుకంటే, IMDB రిలీజ్ చేసిన మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీ ర్యాంకింగ్ లో టాప్ లో నిలిచింది సమంత. అవును, ఇండియాలోని అత్యంత పాపులర్ సెలెబ్రిటీగా నిలిచింది. ఇక్కడ విశేషం ఏంటంటే, గతవారం ఇదే లిస్టులో 9వ స్థానంలో ఉంది సమంత. కేవలం ఒక్కవారంలో టాప్ లోకి వచ్చేసింది.
పూజా హెగ్డే 5వ స్థానంలో, అల్లు అర్జున్ 17వ స్థానంలో
ఇక ఈ లిస్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 17వ స్థానంలో ఉన్నాడు. ఇటు తెలుగులోనూ, అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాల్లో కనిపిస్తున్న పూజా హెగ్డే, 5వ స్థానంలో ఉంది. మొత్తానికి సమంత మరోసారి తన స్టామినాను రుజువు చేసుకుంది. ప్రతీ వారం, ఈ ర్యాంకింగ్స్ ను విడుదల చేస్తుంది IMBD. సమంత ప్రస్తుతం సిటడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది. ముంబైలో జరుగుతున్న ఈ సిరీస్ షూటింగుల్లో పాల్గొంటోంది. ఈ సిరీస్ లో యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని, అందులో నటించడం కొత్తగా ఉందని సమంత చెప్పుకొచ్చింది. అంతేకాదు, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఖుషి చిత్ర షూటింగుల్లోనూ సమంత పాల్గొంటుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా కనిపిస్తున్నాడు.