ఇటలీ వీధుల్లో సమంత, యూరప్ లో చక్కర్లు కొడుతున్న హీరోయిన్
ఈ వార్తాకథనం ఏంటి
హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రపంచ పర్యటనలో ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సమంత పర్యటిస్తున్న ప్రాంతాలు చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది.
సినిమాలకు సెలవు తీసుకుని తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించిన సమంత, అమెరికాలో మయాసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
అటు ఆరోగ్యం కోసం చికిత్స తీసుకుంటూనే మరోవైపు మానసిక ఆరోగ్యం కోసం ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు సమంత. న్యూయార్క్ నగర్ వీధుల్లో తిరిగిన సమంత ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.
న్యూయార్క్ నుండి ఆస్ట్రియా వెళ్లిన సమంత, అక్కడ సెల్జ్ బర్గ్ నగరంలో మోండ్సీ సరస్సు వద్ద కొన్ని ఫోటోలను దిగింది.
Details
వెనిస్ వీధుల్లో సమంత
ప్రస్తుతం ఆస్ట్రియా నుండి ఇటలీ వచ్చేసారు సమంత. ఇటలీలోని వెనిస్ వీధులకు సంబంధించిన ఫోటోలను సమంత షేర్ చేశారు.
అంతేకాదు ఒకానొక ప్రదేశంలో క్యూలో నిలుచున్నారు. తన ఇటలీ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సమంత షేర్ చేయడంతో ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయాయి.
అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ ఇలా వరుసగా రకరకాలు దేశాలు తిరిగేస్తున్న సమంత.. ఆ తర్వాత ఏ దేశం వెళుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
సమంత నటించిన ఖుషి చిత్రం ఇటీవల బాక్సాఫీస్ వద్ద విడుదలై ఓ మోస్తారు ఫలితాన్ని అందుకుంది. ఇంకా ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది.