Page Loader
Samantha:'శాంతి' గురించి సమంత క్రిప్టిక్ పోస్ట్‌.. ఇది కొందరికి సరైన సమాధానమంటున్న ఫ్యాన్స్‌
'శాంతి' గురించి సమంత క్రిప్టిక్ పోస్ట్‌

Samantha:'శాంతి' గురించి సమంత క్రిప్టిక్ పోస్ట్‌.. ఇది కొందరికి సరైన సమాధానమంటున్న ఫ్యాన్స్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 15, 2024
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగ చైతన్య శోభితా ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత రూత్ ప్రభు ఓ క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేసింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీని పంచుకుంది. ఈ సెల్ఫీ లో సంత చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. సెల్ఫీ లో ఉన్న టీ షర్ట్ పై రాసున్న కొటేషన్‌.. ఈ ఫొటోకు ఆమె జోడించిన పాట అభిమానులను అలరిస్తోంది. 'శాంతి, నిశ్శబ్దాల మ్యూజియం' అని రాసుండగా దీనికి 'Now We Are Free' అనే ఆంగ్ల పాటను ఆమె జోడించారు. ఈ పోస్ట్ పై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందంగా ఉన్నారని ఓ నెటిజన్‌ ప్రశంసించగా.. 'రాణి ఎప్పటికీ రాణినే' అంటూ మరో అభిమాని కామెంట్‌ చేశారు.

వివరాలు 

'బృంద' టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పిన సామ్.. 

అయితే సామ్ పరోక్షంగా మిడిల్ ఫింగర్ చూపిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.డైరెక్టర్ రాజ్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్లకూ కౌంటర్ ఇచ్చారని మరికొందరు అంటున్నారు. కాగా,నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత సామ్ షేర్‌ చేసిన తొలి ఫొటో ఇదే కావడం విశేషం. ఏదైనా కొత్త సినిమాలు,వెబ్‌ సిరీస్‌లు విడుదలైతే వాటిపై తన అభిప్రాయాన్ని తెలియజేయడంలో సామ్ ఎప్పుడూ మండుతుంది. ఈ మధ్య విడుదలైన'బృంద'పై ఆమె రివ్యూ ఇచ్చారు.'త్రిష నీ పాత్రలో అద్భుతంగా నటించావు.టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు'అంటూ పోస్ట్‌ పెట్టారు. ఈపోస్ట్‌కు రిప్లై ఇచ్చిన త్రిష..'థ్యాంక్యూ సామ్‌ డార్లింగ్‌' అని కామెంట్ పెట్టారు. సూర్య మనోజ్‌ వంగల దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బృంద' సోనీలివ్‌ యాప్ లో విడుదల అయ్యిన విషయం తెలిసిందే.