Page Loader
నిఖిల్ స్వయంభు హీరోయిన్‌ ఆమెనే.. ఆగస్ట్ 18 నుంచి షూటింగ్ షురూ
ఆగస్ట్ 18 నుంచి షూటింగ్ షురూ

నిఖిల్ స్వయంభు హీరోయిన్‌ ఆమెనే.. ఆగస్ట్ 18 నుంచి షూటింగ్ షురూ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
06:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

యుంగ్ స్టార్ హీరో నిఖిల్ సిద్దార్థ స్వయంభులో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్‌ హీరోయిన్ పాత్ర పోషించనున్నట్లు టాలీవుడ్ లో వార్త చక్కెర్లు కొడుతోంది. నిఖిల్‌, సంయుక్తా మీనన్‌ కాంబో సూపర్ హిట్ జోడిగా నిలవనుంది. ఈ ఏడాది స్పై (SPY) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో నిఖిల్ సిద్దార్థ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే నిఖిల్ జన్మదినం సందర్భంగా స్వయంభు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం అది నెట్టింట సందడి చేస్తోంది. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ 20గా తెరకెక్కుతోంది.

DETAILS

పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్, సంయుక్త స్వయంభూ

నిఖీల్‌ సినీ కెరీర్‌లోనే స్వయంభు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఆగస్ట్ 18న నిఖిల్ టీం ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చేయనుంది. ఈ మేరకు రెగ్యులర్‌ షెడ్యూల్‌ షూటింగ్ ప్రారంభంకానుట్లు సమాచారం. వారియర్ రోల్‌ కోసం నిఖిల్ మేక్ ఓవర్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కేజీఎఫ్‌ (KGF) మ్యూజిక్ స్టార్ రవి బస్రూర్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిఖిల్ యుద్ధ వీరుడిగా సరికొత్తగా మెరవనున్నట్లు ఫస్ట్ లుక్‌తోనే డైరెక్టర్ తేల్చేశాడు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో చిత్రం విడుదల కానుంది.