#SuperSubbu: సందీప్ కిషన్ నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు సిరీస్..సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా 'సూపర్ సుబ్బు' టీజర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ మొదటిసారిగా తెలుగులో వెబ్ సిరీస్‌ను ప్రకటించింది.
ఇప్పటికే బాలీవుడ్‌లో సాక్రేడ్ గేమ్స్, ఢిల్లీ క్రైమ్, బాంబే బేగమ్స్, రానా నాయుడు, కాలాపానీ, హిరామండీ వంటి వెబ్ సిరీస్‌లను నిర్మించి భారీ విజయాన్ని సాధించిన నెట్‌ఫ్లిక్స్, ఇప్పుడు తెలుగులో కామెడీ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తోంది.
"సూపర్ సుబ్బు" పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
వివరాలు
ఈ వెబ్ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం
టీజర్‌ను పరిశీలిస్తే, ఇందులో సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు.
మాకిపూర్ అనే గ్రామంలో ప్రజలు విచ్చలవిడిగా పిల్లలను కలిగి ఉంటారు.
దీంతో, కుటుంబ నియంత్రణ చర్యలు, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అతడిని నియమించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.
ఫుల్ హిలేరియస్‌గా కనిపిస్తున్న ఈ టీజర్‌లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
"నరుడా డోనరుడా, టిల్లు స్క్వేర్" సినిమాల దర్శకుడు మల్లిక్ రామ్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.