
Pushpa 2: పుష్ప 2లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ .. ఆ క్యారెక్టర్ కోసమే..
ఈ వార్తాకథనం ఏంటి
పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు 15న అనుకున్న టైమ్‌కి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
సియాసత్ ప్రకారం, సంజయ్ దత్ పుష్ప 2 లో అతిధి పాత్రలో దింపుతున్నారని టాక్.
నివేదికల ప్రకారం, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పుష్ప 2లో ఓ కీలక పాత్రలో నటించనున్నారట.
ఈ సినిమాలో ఓ హై పాయింట్ దగ్గర సంజయ్ దత్ పాత్ర ఎంట్రీ ఇస్తుందట. డాన్ క్యారెక్టర్‌లో సంజయ్ కనిపిస్తారని అంటున్నారు.
Details
బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప: ది రైజ్
గతంలో, పుష్ప 2 కోసం మనోజ్ బాజ్‌పేయిని సంప్రదించినట్లు వార్తలు కూడా వచ్చాయి.అయితే, ఈ వార్తలను మనోజ్ బాజ్‌పేయి ఖండించారు.
2021లో విడుదలైన పుష్ప: ది రైజ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ ని శాసించింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ చివరి దశ జరుగుతోంది.
నవంబర్ 2023లో, అల్లు అర్జున్ ఆరోగ్య సమస్యల కారణంగా షూట్ కొన్ని వారాల పాటు ఆగిపోయింది, అయితే అది తర్వాత తిరిగి ప్రారంభమైంది.