Sanjay Dutt: సాయి ధరమ్ తేజ్ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్?
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించగా, మరికొన్ని ప్రాజెక్టుల్లో కూడా నటిస్తున్నాడు.
తాజాగా, ఆయన మరో తెలుగు చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'సంబరాలు ఏటిగట్టు' సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
'హనుమాన్' నిర్మాతల బ్యానర్‌పై, రోహిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
సంజయ్ దత్ పాత్ర గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
Details
త్వరలోనే షూటింగ్ లో పాల్గొనే అవకాశం
దర్శకుడు రోహిత్ ఆయనకు కథ వినిపించగా, సంజయ్ దత్‌కి అది బాగా నచ్చిందట.
అంతేకాకుండా హనుమాన్ నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో ఆయన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నాడని, రామ-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న భారీ ఫైట్ సీక్వెన్స్‌లో సంజయ్ దత్ యాక్షన్ చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.