Sankranthi Movies: 2024 సంక్రాంతి సినిమాల లిస్ట్ ఇదే.. ఒకదానికి మించి మరొకటి..!
సంక్రాంతి పండగ అంటే కొత్త అల్లుళ్ళు,కోడి పందాలు,పిండివంటలే కాదు.. సినిమాలు కూడా. ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమాలు హడావిడి ఇంత అంత కాదు. చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ సినిమాని సంక్రాంతికి విడుదల చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తారు. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి కూడా బోలెడు సినిమాలు విడుదల కి సిద్ధం అవుతున్నాయి. ఈసారి ఏకంగా 6 సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. మరి సంక్రాంతి బరిలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram).ఇందులో శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్స్.
జనవరి 12న హను-మాన్
ఈ సినిమా జనవరి 12న థియేటర్‌లలో విడుదల కానుంది. త్రివిక్రమ్,మహేష్ కాంబోలో ఇది మూడవ చిత్రం.ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయ్యిన పాటలు సూపర్ డూపర్ గా ఉన్నాయి. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని హారిక,హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. తెలుగు సినిమాలలో డిఫ్రెంట్ స్టోరీస్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఈ డైరెక్టర్ తేజ సజ్జా హీరో గా 'హను-మాన్'(Hanu Man)తో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదల అయ్యిన టీజర్, ట్రైలర్ అదరగొట్టింది.ఈ సినిమా పెద్దవాళ్ళని,చిన్నారులను సైతం అలరించేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది.
జనవరి 12న అయలాన్
ఎప్పటిలాగే సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఒకట్రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా పలకరించనున్నాయి. ఈసారి 'అయలాన్' (Ayalaan) అనే తమిళ మూవీతో శివకార్తికేయన్ రెడీ అయ్యారు. ఆర్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. వాతావరణ మార్పుల వల్ల భూమికి వచ్చే ఆపద ఏంటి? అందుకు కారణం ఎవరు? అనుకోకుండా గ్రహాంతరవాసి భూమిపైకి ఎందుకు వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
జనవరి 13న సైంధవ్
కేవలం రెండు అంటే రెండే సినిమాలు తీసిన దర్శకుడు శైలేష్ కొలను. ఈయనకు వెంకటేశ్ 75వ చిత్రం తెరకెక్కించే అవకాశం వచ్చింది. మొన్నీమధ్య వచ్చిన 'సైంధవ్' టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత వెంకీ మామను కొత్త అవతారంలో చూపించిన శైలేష్ కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలే వచ్చాయి. ఈ 'సైంధవ్' (Saindhav)మూవీ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రం జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. కూతురి సెంటిమెంట్, వెంకటేశ్ యాక్షన్ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. శ్రద్ధాశ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు.
జనవరి 14న నా సామిరంగ
సంక్రాంతికి రేసులో ప్రేక్షకులను పలకరించేందుకు మరో స్టార్ హీరో కూడా సిద్ధమయ్యారు. ఆయనే నాగార్జున (Nagarjuna). నాగార్జున హీరోగా విజయ్ బిన్ని డైరెక్టర్ వస్తున్న సినిమా 'నా సామిరంగ' (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్ హీరోయిన్. ఈ చిత్రంలో అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. మలయాళంమూవీ 'పొరింజు మరియం జోసే' చిత్రానికి ఇది రీమేక్ . తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు. ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.