Page Loader
Sankranthiki Vasthunam: ఓటిటిలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' .. ఎప్పుడంటే..?

Sankranthiki Vasthunam: ఓటిటిలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' .. ఎప్పుడంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా బ్లాక్‌బస్టర్ "సంక్రాంతికి వస్తున్నాం" (Sankranthiki Vasthunam). ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై కుటుంబ ప్రేక్షకులను అలరించింది. కుటుంబ కథా నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రేక్షకులు ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, థియేటర్ల అనంతరం, ఈ చిత్రాన్ని ఓటీటీకి ముందుగా టీవీలో ప్రసారం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

ఏమండోయ్... వాళ్లు వస్తున్నారు

దీనికి నిర్మాతలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, టీవీలో ప్రసారం కంటే ముందే ఓటీటీ విడుదల గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ మరియు టీవీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా జీ5 సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసింది. "ఏమండోయ్... వాళ్లు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కొంత చమత్కారం కోసం వేచి ఉండండి" అంటూ ఓ పోస్ట్‌లో తెలిపింది. అంతేకాదు, #SankranthikiVasthunamComingSoon అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. ఈ నేపథ్యంలో, త్వరలోనే ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 జీ5 చేసిన ట్వీట్