Page Loader
Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్

Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2023
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

మంచు విష్ణు ప్రస్తుతం తన డీం ప్రాజెక్టు 'కన్నప్ప' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ న్యూజిలాండ్ అడవుల్లో జరగుతోంది. బాలీవుడ్ డైరక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సౌత్ టు నార్త్ బడా స్టార్స్ అంతా ఈ ప్రాజెక్టులో నటిస్తుండటంతో ఈ సినిమా బిగ్గెస్ట్ మూవీగా మారుతోంది. ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడంటూ తెలియజేసి పాన్ ఇండియా వైడ్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మధుబాల, నయనతార వంటి స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నారంటూ ప్రకటించి మరింత హైప్‌ని క్రియేట్ చేశారు.

Details

న్యూజిలాండ్ కు చేరుకున్న శరత్ కుమార్

తాజాగా ఈ ప్రాజెక్టులోకి మరో నటుడు కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. దక్షిణాదిలో శరత్ కుమార్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా, ప్రముఖ పాత్రల్లో నటించి మంచి క్రేజ్‌ను సంపాదిచుకున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కోసం శరత్ కుమార్ న్యూజిలాండ్ చేరుకున్నట్లు తెలిసింది. అక్కడ మోహన్ బాబుతో దిగిన ఫోటోను శరత్ కుమార్ రిలీజ్ చేశారు. మహాభారతం సీరియల్ తీసిన ముకేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని భారీ ఎత్తున్న తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.