Page Loader
Sarkaru Naukari: సింగర్ సునీత కొడుకు హీరోగా 'సర్కారు నౌకరి'.. జనవరి 1న విడుదల
సింగర్ సునీత కొడుకు హీరోగా 'సర్కారు నౌకరి'.. జనవరి 1న విడుదల

Sarkaru Naukari: సింగర్ సునీత కొడుకు హీరోగా 'సర్కారు నౌకరి'.. జనవరి 1న విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2023
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ గాయని సునీత గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆమె తనయుడు వెండితెర అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. సునీత కుమారుడు ఆకాష్ హీరోగా నటించిన 'సర్కారు నౌకరీ' సినిమా న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 1 థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీని ఆర్కే టెలీ షో బ్యానరపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Details

సోషల్ డ్రామా కథతో తెరకెక్కుతున్న 'సర్కారు నౌకరి'

ఇక సర్కారు నౌకరి సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఆకాష్, భావనతో పాటు తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ నటిస్తున్నారు. ఈ సినిమాను సోషల్ డ్రామా కథతో ఆకట్టుకునేలా రూపొందించామని దర్శకుడు పేర్కొన్నాడు. ఈ సినిమాలో ఆకాష్ సరసన భావనా వళపండల్ నటించారు. కథానాయికగా ఆమెకు కూడా తొలి సినిమా ఇది.