NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి సినిమా నుండి 'పన్నెండు గుంజల పందిర్ల కింద' " లిరికల్ సాంగ్ విడుదల 
    తదుపరి వార్తా కథనం
    Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి సినిమా నుండి 'పన్నెండు గుంజల పందిర్ల కింద'

    Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి సినిమా నుండి 'పన్నెండు గుంజల పందిర్ల కింద' " లిరికల్ సాంగ్ విడుదల 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2024
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.

    అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని 'పన్నెండు గుంజల పందిర్ల కింద' అనే లిరికల్ సాంగ్‌ని స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు.

    "షరతులు వర్తిస్తాయి" దర్శకుడు కుమారస్వామి కష్టాన్ని,అంకితభావాన్ని గుర్తు చేస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల తన అభిమానాన్ని చాటుకున్నారు.

    Details 

     ప్రతి పెళ్లిలో ఈ పాట వినిపిస్తుంది: శేఖర్ కమ్ముల 

    కమ్ముల సురేష్ బొబ్బిలి సంగీతాన్ని,పెద్దింటి అశోక్ కుమార్ సాహిత్యాన్ని మెచ్చుకుంటూ ఈ పాట వింటుంటే తెలంగాణ మట్టివాసన కనిపిస్తోందన్నారు.

    నేను ఫిదా సినిమాలో వచ్చిండే పాట తీసినప్పుడు కూడా ఇలానే ఫీల్ అయ్యానన్నారు. ప్రతి పెళ్లిలో ఈ పాట వినిపిస్తుందని అనుకుంటున్నారు.

    చైతన్యరావు సహజమైన నటనను మెచ్చుకుంటూ,పాటలతో పాటు ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మొత్తం టీమ్ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

    Details 

    శేఖర్ కమ్ములకు హీరో  చైతన్యరావు కృతజ్ఞతలు

    ఈ పాటకు సహకరించిన అశోక్ కుమార్, సురేష్ బొబ్బిలికి అలాగే ఈ పాటను విడుదల చేసినందుకు శేఖర్ కమ్ములకు హీరో చైతన్యరావు కృతజ్ఞతలు తెలిపారు.

    రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో ఈ పాట వైరల్ అవుతుందని అన్నారు."షరతులు వర్తిస్తాయి"లో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడు కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, హీరో చైతన్య రావు, డైరెక్టర్ కుమార స్వామి, రచయిత పెద్దింటి అశోక్ కుమార్.. పలువురు మూవీ యూనిట్ పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025