LOADING...
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో సంచలన తీర్పు.. అనుమతి లేకుండా పేరు వాడితే కఠిన చర్యలు
అల్లు అర్జున్ కేసులో సంచలన తీర్పు.. అనుమతి లేకుండా పేరు వాడితే కఠిన చర్యలు

Allu Arjun: అల్లు అర్జున్ కేసులో సంచలన తీర్పు.. అనుమతి లేకుండా పేరు వాడితే కఠిన చర్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించి వ్యక్తిగత హక్కుల పరిరక్షణపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెలబ్రిటీల ఫోటోలు, పేరు, గొంతు వంటి అంశాలను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్న డిజిటల్ దుర్వినియోగంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ తీర్పు బన్నీకి న్యాయపరంగా పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఆయన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) రక్షణకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ఉపయోగించి ఆయన పేరు, ఫోటోలు, గొంతు, హావభావాలను వాణిజ్యపరంగా లేదా ఇతర ఏ విధంగానైనా అనుమతి లేకుండా వినియోగించకూడదని స్పష్టమైన స్టే ఇచ్చింది.

వివరాలు

హర్షం వ్యక్తం  చేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. సెలబ్రిటీల ఇమేజ్‌ను దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారాలు చేయడం లేదా వారి అనుమతి లేకుండా లాభాలు పొందడం చట్టవిరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ తీర్పు కేవలం సినిమా రంగానికే కాకుండా అన్ని రంగాల సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు మైలురాయిగా నిలుస్తుంది. ఇదే తరహాలో గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు కూడా కోర్టు ఆదేశాలు పొందిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement