Saif Ali Khan:భోపాల్ హైకోర్టు సంచలన తీర్పు.. రూ. 15 వేల కోట్ల ఆస్తిపై హక్కు కోల్పోయిన సైఫ్ అలీఖాన్ కుటుంబం
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు మరోసారి షాక్ తగలినట్లు కనిపిస్తోంది.
అతడి కుటుంబానికి చెందిన దాదాపు 15 వేల కోట్ల విలువైన ఆస్తులు మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి.
సైఫ్ అలీ ఖాన్ పటౌడి రాజ వంశీయుల కుటుంబానికి చెందిన వ్యక్తి. పటౌడి రాజవంశానికి చెందిన ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ 1947లో భారతదేశ విభజన సమయంలో తన ఆస్తులు భారత్‌లో వదిలి పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు.
అప్పట్లో భారత ప్రభుత్వం ఎనిమి ప్రాపర్టీ చట్టం ప్రకారం, దేశాన్ని వదిలి వెళ్లిన వారి ఆస్తులు ప్రభుత్వాధీనంలోకి వస్తాయని నిర్ణయించింది.
ఈ క్రమంలో అబీదా సుల్తాన్ వదిలి వెళ్లిన రూ.15 వేల కోట్ల ఆస్తులు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదిగా ప్రకటించారు.
Details
వారసత్వానికి చెందిన ఆస్తులని తెలిపిన సైఫ్ అలీఖాన్
అయితే సైఫ్ అలీ ఖాన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆస్తులు తమ వారసత్వానికి చెందినవని, వాటిపై తమకు పూర్తి హక్కులున్నాయని ఆయన న్యాయస్థానంలో వాదించారు.
అప్పట్లో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా, భోపాల్ హైకోర్టు 2024డిసెంబర్ 13న ఈ స్టేను ఎత్తివేసింది.
స్టే ఎత్తివేత అనంతరం 30 రోజులపాటు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా ఆ సమయంలో పెద్దగా చర్యలు తీసుకోలేదు.
ఈ కారణంగా ఆ రూ.15వేల కోట్ల ఆస్తులు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతాయని భోపాల్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
సైఫ్ అలీఖాన్ ఈ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తారా? లేదా ఆ ఆస్తులను వదిలేస్తారా అని తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.