
Kantara : కాంతార టీమ్‌లో వరుస మరణాలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాంతార' దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'కాంతార చాప్టర్ 1' చుట్టూ ప్రస్తుతం రహస్యాలు, అపోహలు, గాసిప్స్ హద్దుమీరుతున్నాయి. పౌరాణిక శక్తుల నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ దశలోనే అనేక సవాళ్లను ఎదుర్కొంది. చిత్రబృందంలోని నలుగురు సభ్యుల మరణాలు, షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదాలు, సినిమాలో కనిపించిన దున్నపోతు మృతి వంటి సంఘటనలు కాంతార టీమ్‌ను ఏదో దుష్టశక్తి వెంటాడుతోందా? అన్న అనుమానాలను రేకెత్తించాయి. ఈ విషయాలను మీడియా హైలైట్ చేయడంతో ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. అయితే ఎట్టకేలకు చిత్ర నిర్మాత చలువే గౌడ ఈ ప్రచారంపై స్పందించారు.
Details
అవన్నీ తప్పుడు ప్రచారాలు
'మా సినిమాపై జరుగుతున్న కొన్ని కథనాలు పూర్తిగా తప్పు. అవును, కొన్ని ప్రమాదాలు జరిగాయి కానీ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. 2025లో ఒకసారి సెట్లో అగ్నిప్రమాదం జరిగినా, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. మరోసారి నదిలో పడవ మునిగింది, అప్పుడు కెమెరాలు, పరికరాలు మాత్రమే దెబ్బతిన్నాయని వివరించారు. సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందు పంజుర్లి అమ్మవారిని దర్శించుకున్నామని, ఆమె దివ్యదర్శనంలో కొంత అడ్డంకులు ఉన్నప్పటికీ చివరికి చిత్రీకరణ విజయవంతంగా పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 'ప్రతిరోజూ తెల్లవారుఝామున 4 గంటలకు లేచి, ఉదయం 6 గంటలకు షూటింగ్ మొదలుపెట్టేవాళ్లం. మధ్యలో ఎన్నో విమర్శలు ఎదురైనా, ఇప్పుడు ఫుటేజ్ చూసి చాలా సంతృప్తిగా ఉందని చెప్పారు.