Page Loader
బిగ్ బాస్ షోలోకి డబ్బులిచ్చి వెళ్తారు: సంచలన కామెంట్స్ చేసిన సరయు 
బిగ్ బాస్ షోపై కామెంట్లు చేసిన సరయు

బిగ్ బాస్ షోలోకి డబ్బులిచ్చి వెళ్తారు: సంచలన కామెంట్స్ చేసిన సరయు 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 23, 2023
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు టెలివిజన్‌లో బిగ్ బాస్ రియాల్టీ షో పాపులారిటీ అంతా ఇంతా కాదు. షో మొదలైనప్పటి నుండి ముగిసేదాకా టీఆర్పీ రేటింగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆల్రెడీ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ నాగార్జున ప్రోమో కూడా వదిలారు. అయితే బిగ్ బాస్ షోపై సెవెన్ ఆర్ట్స్ సరయు సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ ఫేక్ అని, అందులోకి కొంతమంది డబ్బులిచ్చి వెళ్తారని, అలాంటి వాళ్ళకు హౌస్‌లో సపోర్ట్ ఉండేదని, వాళ్లతో గొడవకు దిగితే మనమే నెగెటివ్ ఐపోతామని ఆమె అంది.

Details

రియాల్టీ షోస్ అన్నీ ఫేక్ 

బిగ్ బాస్ ఫేక్ అని, తమను తాము ప్రమోషన్ చేసుకోవడం కోసం చాలామంది బిగ్ బాస్ కు వెళ్తారని, అలాంటి షో చూడటం వేస్ట్ అనీ, రియాల్టీ షోస్ అనేవి పూర్తిగా ఫేక్ అని ఆమె చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 5వ సీజన్ కంటెస్టెంట్‌గా హౌస్ లోకి సరయు అడుగుపెట్టింది. అయితే మొదటివారంలోనే ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీలో ప్రసారమైన సీజన్లో కూడా కంటెస్టెంట్‌గా వెళ్ళింది. అక్కడ కూడా నాలుగు వారాల కంటే ఎక్కువగా ఉండలేకపోయింది. మొత్తానికి బిగ్ బాస్ షో మీద సరయు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.