Loading...
Shekhar Master Car Accident: శేఖర్ మాస్టర్ కారుకు ఘోర ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు!
శేఖర్ మాస్టర్ కారుకు ఘోర ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు!

Shekhar Master Car Accident: శేఖర్ మాస్టర్ కారుకు ఘోర ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆయనతో పాటు కారులో ఉన్న మరో ముగ్గురు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న నలుగురూ క్షేమంగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాలు

వెనుక నుంచి ఢీకొట్టిన పండ్ల లోడు లారీ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమాలోని ఓ పాటకు సంబంధించిన నైట్ షూటింగ్‌ను ముగించుకున్న శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ వద్దకు చేరుకోగానే ప్రమాదం జరిగింది.

ఉదయం సుమారు 6 గంటల సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన పండ్ల లోడు లారీ వీరి కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద ధాటికి కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే కారులో ఉన్న శేఖర్ మాస్టర్‌తో పాటు మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.

వివరాలు

అయ్యప్ప స్వామి దయ వల్లే క్షేమంగా ఉన్నాం: శేఖర్ మాస్టర్

ఈ ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఓ వీడియో సందేశం ద్వారా స్పందించారు. "కాకా సాంగ్ షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 6 గంటలకు కారు యాక్సిడెంట్‌కు గురైంది.

కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో కారులో మేము నలుగురం ఉన్నాం. అయ్యప్ప దయ వల్లే మాకు ఏమీ జరగలేదు.

అందరూ నాకు ఏమైందో అని మెసేజ్‌లు చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మాతో పాటు ఉన్నవారు కూడా క్షేమంగా ఉన్నారు.

ఈరోజు రాత్రికి కూడా షూటింగ్ ఉంది. దానికి బయల్దేరుతున్నానని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

ప్రమాదం నుంచి బయటపడటంపై భావోద్వేగం

ఇటీవలే అయ్యప్ప స్వామి మాల ధరించిన శేఖర్ మాస్టర్.. స్వామివారి ఆశీస్సుల వల్లే ఇంతటి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామని భావోద్వేగంతో వెల్లడించారు.

తామంతా క్షేమంగా ఉన్నామని ఆయన స్పష్టం చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.

ADVERTISEMENT