Page Loader
Tollywood: సినిమాల్లో అవకాశం పేరుతో మహిళపై లైంగిక దాడి.. అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు
సినిమాల్లో అవకాశం పేరుతో మహిళపై లైంగిక దాడి.. అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు

Tollywood: సినిమాల్లో అవకాశం పేరుతో మహిళపై లైంగిక దాడి.. అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

సినిమాల్లో ఛాన్స్‌ పేరుతో మహిళపై లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాదులో వెలుగుచూసింది. సినీ అవకాశాల కోసం రోజూ అనేక మంది హైదరాబాదుకు వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళను సినిమాల్లో అవకాశం పేరుతో మోసం చేసి అత్యాచారయత్నం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్‌పై కేసు నమోదైంది. బాధిత మహిళ భర్తతో విడిపోయి మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి, మణికొండలో బంధువుల ఇంట్లో నివసించేది. అయితే ఇటీవల ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లి అమీర్‌పేటలోని హాస్టల్‌లో చేరింది. సినీ పరిశ్రమలో అవకాశాలు పొందాలని కోరుకుంటున్న ఆమెకు 15 రోజుల కిందట ఓ సినిమాలో హౌస్ కీపింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసే అవకాశం వచ్చింది.

Details

సినిమా

ఈ సమయంలో ఆమెపై కాటేకొండ రాజు అనే వ్యక్తి కన్నేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్న రాజు, ఆమెను జూనియర్ ఆర్టిస్ట్‌గా చేయడానికి ఆసక్తి చూపిస్తూ కృష్ణానగర్‌లోని హెవెన్ హోటల్‌కు పిలిచాడు. అక్కడ ఆడిషన్స్ పేరుతో ఫోటోషూట్ నిర్వహించి, రకరకాల ఫోటోలు తీశాడు. మరుసటి రోజు మరోసారి రావాలని చెప్పి, గదిలోకి తీసుకెళ్లిన రాజు మహిళపై అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా రాజుపై 64, 79, 115, 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.