Shahrukkhan: హురున్ ఇండియా ధనవంతుల జాబితాలో షారుక్ ఖాన్.. ఎంత సంపద ఉందంటే?
బాలీవుడ్ రాజు షారుక్ ఖాన్ ఏదో ఒక కారణంతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తన సుదీర్ఘ సినీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించాడు. అతనికి భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుక్ 7,300 కోట్ల రూపాయల ఆస్తులతో హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో మొదటిసారి చేరాడు. కోల్‌కతా నైట్ రైడర్స్,రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వాటా కారణంగా షారుక్ ఈ జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. అమితాబ్ బచ్చన్, జూహీ చావ్లా అండ్ ఫ్యామిలీ, కరణ్ జోహార్, హృతిక్ రోషన్ కూడా ఈ హురున్ ఇండియా జాబితాలో మొదటిసారిగా చేరారు.
మొదటి స్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ
హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ,ఎంటర్టైన్మెంట్ రంగం నుండి మొదటిసారిగా హురున్ ఇండియా జాబితాలో చేరిన 7మంది ఒక సంవత్సరంలో 40,500కోట్ల రూపాయల విలువైన సంపదను జోడించారు. భారతదేశంలోని 334 మంది బిలియనీర్ల సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ మొదటి స్థానంలో ఉన్నారు. దీని తరువాత, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముకేష్ అంబానీ అంటే గౌతమ్ హురున్ రిచ్ లిస్ట్‌లో భారతదేశపు అత్యంత ధనవంతుడు అయ్యాడు. దీని తర్వాత ముఖేష్,శివ నాడార్ ఉన్నారు.13ఏళ్ల క్రితం విడుదల చేసిన జాబితా కంటే ఇది 6రెట్లు ఎక్కువ. ఈ జాబితాలో ఇప్పుడు రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన 1,500 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారు.