Shakeela: ఫోన్‌తో జాగ్రత్త.. రూ.3 లక్షలు ఖర్చు.. నరకయాతన అనుభవించా: నటి షకీల
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటి షకీల తనకు ఎదురైన ఓ తీవ్ర ఆరోగ్య సమస్య గురించి అభిమానులతో పంచుకున్నారు. మొబైల్ ఫోన్‌ను అతిగా ఉపయోగించడం వల్ల తీవ్ర మెడ నొప్పికి గురయ్యానని, చివరకు రూ.3 లక్షలు ఖర్చు చేసి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మొబైల్ వినియోగంపై అభిమానులకు పలు సూచనలు చేశారు. ఫోన్‌లో ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, యూట్యూబ్ చూడటం, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వీక్షించడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని షకీల తెలిపారు. నిద్రపోయే సమయంలో కూడా ఒకవైపు వాలిపోయి గంటల తరబడి ఫోన్ చూడటంతో మెడలోని నరాలపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. దీంతో చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
వివరాలు
షకీల కీలక సూచన..
''ఫోన్ మన జీవితంలో చాలా ముఖ్యమైనది. కానీ అవసరానికి మించి ఉపయోగించకండి.
ఉపయోగం లేని వీడియోలు చూస్తూ సమయాన్ని వృథా చేయొద్దు. ఫోన్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే డబ్బులు ఖర్చు కావడమే కాకుండా, భరించలేని నరకయాతన అనుభవించాల్సి వస్తుంది.
ముఖ్యంగా చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మొబైల్ వినియోగాన్ని తగ్గించాలి'' అని షకీల సూచించారు.
వివరాలు
సినీ పరిశ్రమలోకి ఎంట్రీ..
షకీల 18 ఏళ్ల వయసులో 'ప్లే గర్ల్స్' అనే తమిళ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
2000లో విడుదలైన మలయాళ చిత్రం 'కిన్నార తుంబికల్' ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.
దర్శకుడు తేజ తెరకెక్కించిన 'జయం' సినిమాతో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత 'నిజం', 'బంగారం', 'తొట్టిగ్యాంగ్' తదితర చిత్రాల్లో నటించారు.