తదుపరి వార్తా కథనం

Shanmukh Jaswanth:డ్రగ్ కేసులో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 22, 2024
12:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్,అతని సోదరుడు సంపత్ ను వేరు వేరు కేసులలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
విషయంలోకి వెళితే..షణ్ముఖ్ సోదరుడు సంపత్ డాక్టర్ అయిన మౌనిక అనే యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా మరో అమ్మాయిని సంపత్ వివాహం చేసుకున్నాడు.
సంపత్ పెళ్లి విషయం తెలుసుకున్న మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సంపత్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు అతడి ఫ్లాట్‌కు వెళ్లగా..అక్కడ షణ్ముఖ్ డ్రగ్ తీసుకుంటూ దొరికిపోయాడు.
ఈ అనూహ్య పరిణామంతో పోలీసులు షణ్ముఖ్ పై కేసు నమోదు చేశారు.అతని సోదరుడు సంపత్‌తో పాటు యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
షణ్ముఖ్‌పై డ్రగ్స్ కేసు,సంపత్‌పై చీటింగ్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది.విషయం తెలిసిన ఫాన్స్.. షణ్ముఖ్‌పై మండిపడుతున్నారు.