Loading...
Sharwanand : మహాభారతం కథాంశంతో శర్వానంద్ కొత్త మూవీ.. 'నాగబంధం' దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
మహాభారతం కథాంశంతో శర్వానంద్ కొత్త మూవీ.. 'నాగబంధం' దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!

Sharwanand : మహాభారతం కథాంశంతో శర్వానంద్ కొత్త మూవీ.. 'నాగబంధం' దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 19, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో కథల ఎంపికలో ప్రత్యేకతను చాటుకుంటూ తనదైన ప్రయాణం సాగిస్తున్న హీరో శర్వానంద్ వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆయన నటించిన రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'భోగి' చిత్రంలో నటిస్తున్న శర్వానంద్, ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, భారీ బడ్జెట్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం'తో అందరి దృష్టిని ఆకర్షించిన నిర్మాత-దర్శకుడు అభిషేక్ నామా, తన తదుపరి చిత్రాన్ని శర్వానంద్ హీరోగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

అత్యంత భారీ బడ్జెట్ మూవీ..

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సుమారు రూ.80 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నట్లు సమాచారం.

'నాగబంధం' చిత్రంలో నిర్మాణ విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన అభిషేక్ నామా బృందం, ఈ ప్రాజెక్ట్‌లో కూడా అదే స్థాయి నాణ్యతను కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో, విజువల్‌గా ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.

శర్వానంద్ సినీ కెరీర్‌లో ఇప్పటివరకు రూపొందిన చిత్రాల్లో ఇదే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

వివరాలు

త్వరలోనే అధికారిక ప్రకటన..

భారతీయ పురాణ ఇతిహాసమైన మహాభారతంలోని ఒక కీలక ఘట్టాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని ఈ చిత్ర కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

పురాణ నేపథ్యాన్ని కమర్షియల్ అంశాలతో మేళవిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రిప్ట్ రూపొందించారని టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు, ఈ సినిమా భారీ మల్టీస్టారర్గా రూపొందనున్నట్లు తెలుస్తోంది.

శర్వానంద్‌తో పాటు మరో ప్రముఖ స్టార్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

ADVERTISEMENT