Page Loader
Tillu Square : విడుదలకు సిద్ధంగా ఉన్న టిల్లు స్క్వేర్.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే
ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే

Tillu Square : విడుదలకు సిద్ధంగా ఉన్న టిల్లు స్క్వేర్.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 27, 2023
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించనున్నారు. ఈ మేరకు టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ ప్రకటించారు. డీజే టిల్లు సినిమాకు కొనసాగింపుగా 'టిల్లు స్క్వేర్'తో ఫిబ్రవరి 9న టాలీవుడ్ ప్రేక్షకులను రంజింపజేయనున్నారు. తొలి పార్టులో నేహా శెట్టి హీరోయిన్ పాత్రలో నటించింది. తాజాగా రెండో పార్టులో కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా మెప్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'టిక్కెట్టే కొనకుండా అనే పాట,తో అనుపమ ఆకట్టుకుంది. నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర లాగే అనుపమ పాత్ర నిలిచిపోనుందని సమాచారం.ే

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర విడుదల తేదీని తెలిపిన నిర్మాణ సంస్ధ