
Siddu Jonnalagadda: సిద్దూ జొన్నలగడ్డ-సితార కాంబో మళ్లీ రిపీట్.. ఈసారి 'BADASS' కథతో!
ఈ వార్తాకథనం ఏంటి
'జాక్' సినిమాతో ఘోర విఫలాన్ని ఎదుర్కొన్న సిద్ధూ జొన్నలగడ్డ, తన కెరీర్‌లో మళ్లీ పట్టును తెచ్చుకోవాలని బౌన్స్ బ్యాక్‌కు సిద్ధమవుతున్నాడు. ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, సిద్ధూ తన రెమ్యునరేషన్‌లో భాగంగా కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు పూర్తిగా 'జాక్' ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో మరోసారి చేతులు కలిపాడు. సిద్ధూ గతంలో 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో సితార బ్యానర్‌లో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బ్యానర్‌లో తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తూ 'మిడిల్ ఫింగర్ మ్యాన్' అనే పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Details
సంగీతం అందించనున్న అనిరుద్ రవిచంద్రన్
ఈ సినిమాకు 'కృష్ణ అండ్ హిజ్ లీల' ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు 'BADASS' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. ఈ నెల 9న అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతేడాది ఇదే కాంబినేషన్‌లో 'కోహినూర్' అనే సినిమా ప్రకటించినప్పటికీ, ఇప్పుడు దానిని పూర్తిగా పక్కనపెట్టినట్టు టాక్. ఈ మూవీ ఓ సినిమా స్టార్ చుట్టూ తిరిగే కథ అని సమాచారం. 'జాక్' సినిమా ఫెయిల్యూర్ తర్వాత తన మార్కెట్‌ను మళ్లీ నిలబెట్టుకోవాలనే సంకల్పంతో సిద్ధూ ఈ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు ఇంకా బయటకు రాలేదు.