
Tollywood : తెలుగులో సైలెంట్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దుమ్మురేపిన మలయాళ మూవీ
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా హలో, చిత్రలహరి ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించిన చిత్రం 'కొత్త లోక చాప్టర్ 1' ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డొమినిక్ అరుణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమాల్లో సూపర్ హీరో సినిమాలు అరుదుగా వస్తున్న తరుణంలో, ఈ మూవీ భారతదేశపు * మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. రిలీజ్ రోజునుండే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచింది. ప్రేక్షకులు, విమర్శకులు సమానంగా ఆమె నటనకు ఫిదా అవుతున్నారు.
Details
బాక్సాఫీస్ రికార్డులు
రిలీజ్‌కి మొదటి మూడు రోజుల్లోనే రూ. 42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 10 రోజుల రన్ పూర్తి చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 167.51 కోట్ల గ్రాస్ రాబట్టి మెగా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ. 83.61 కోట్లు కాగా, ఓవర్సీస్‌లో రూ. 83.91 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
Details
తెలుగులో రికార్డుల దిశగా
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం అంచనాలను మించి రాణిస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మలయాళ డబ్బింగ్ సినిమా 'ప్రేమలు' (నస్లీన్ నటించినది) రూ. 13.5 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అయితే ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయిన 'లోక' 10 రోజుల్లోనే రూ. 11 కోట్లు వసూలు చేసింది. ఇంకో రూ. 2.5 కోట్లు రాబడితే, తెలుగు బాక్సాఫీస్‌లో మలయాళ డబ్బింగ్ సినిమాల ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సృష్టించనుంది. కేరళలోనూ అదే హంగామా అటు కేరళలో కూడా ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా, మలయాళ సినిమా చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ టాక్.