Singer Madhu Priya: పవిత్రమైన ఆలయంలో ఇదేం పని.. వివాదంలో సింగర్ మధు ప్రియ
ఈ వార్తాకథనం ఏంటి
పవిత్రమైన దేవాలయాల్లో కొందరు చేస్తోన్న బాధ్యతరహితమైన చర్యలు భక్తులు,పూజారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణలోని కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయాలను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.
కానీ, ఇటీవల ఈ ఆలయంలో కొందరు ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ కోసం సెట్లు ఏర్పాటు చేశారు.
అందులో కూడా ఆలయం తలుపులు మూసివేసి, భక్తులకు ఇబ్బంది కలిగిస్తూ గర్భగుడిలో షూటింగ్ నిర్వహించారు. ఈ ఆల్బమ్ సింగర్ మధు ప్రియ షూట్ చేసినట్లు వార్తలు చెలరేగాయి.
వివరాలు
భక్తులు ఆగ్రహం
ఈ ఆలయంలోకి ఫోన్‌లు తీసుకెళ్లడం, ఫోటోలు తీయడం నిషేధం.. కానీ వారు ఏకంగా సెట్లు వేయడం, గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ నిర్వహించడం భక్తులలో ఆగ్రహం రేపింది.
ఈ ఘటనతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనిపై తీవ్రంగా స్పందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
దేవాలయ నిర్వాహకులు, దేవదాయ శాఖ దీనిపై స్పందించకపోవడం పట్ల కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
షూటింగ్ జరుగుతోందని తెలిసి, చూస్తూ వదిలేసిన వారికి కూడా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు నినదిస్తున్నారు.
ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. అయితే ఈ వివాదంపై మధుప్రియ అటు ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.