Movie Theaters : తెలంగాణలో మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు
తెలంగాణలో నేటి నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లను మూసివేయాలని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఎన్నికలు,ఐపిఎల్ ఉండటంతో పెద్ద బడ్జెట్ సినిమాలు,స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ రేస్ నుండి తప్పుకున్నారు. ఈ క్రమంలో చిన్న సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దీంతో సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలని చూస్తున్నాయని సమాచారం. రాష్ట్రంలో బహుళ స్క్రీన్‌లు పెరగడం వల్ల రెగ్యులర్ ప్రేక్షకులు లేకపోవడంతో సింగిల్ థియేటర్‌లకు కూడా ఇబ్బంది ఏర్పడింది. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నిర్మాతలు ముందుకు వచ్చి నిర్వహణ భరిస్తే థియేటర్లు తెరుస్తామని యాజమాన్యాల సంఘం తెలిపింది.