LOADING...
Mohammed Siraj : ఓవల్‌లో సిరాజ్ మ్యాజిక్‌.. 34ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు!
ఓవల్‌లో సిరాజ్ మ్యాజిక్‌.. 34ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు!

Mohammed Siraj : ఓవల్‌లో సిరాజ్ మ్యాజిక్‌.. 34ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ సాధించాడు. కపిల్ దేవ్ తర్వాత ఇదే ఫీట్‌ చేసిన భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 34ఏళ్ల తర్వాత ఈ రేర్‌ రికార్డు నమోదవ్వడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో లండన్‌లోని ఓవల్ వేదికగా జరుగుతోన్న ఐదో టెస్టు మ్యాచ్‌లో సిరాజ్ ఈ ఘనత సాధించాడు. భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగుల సాధించగా, ఇంగ్లాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మూడో రోజు ఆటలో వరుసగా రెండు బంతుల్లో రెండు కీలక వికెట్లు తీయడం ప్రత్యేకంగా నిలిచింది.

Details

వరుస బంతుల్లో రెండు వికెట్లు

ఇలా టెస్టు మ్యాచ్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. దీంతో 1990లో కపిల్ దేవ్ చేసిన అరుదైన ఫీట్‌ను సిరాజ్ పునరావృతం చేశాడు. ఓవల్‌ వేదికగా టెస్టు మ్యాచ్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఘనత సిరాజ్‌కి టెస్ట్ కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలవనుంది. ఈ సందర్భంగా సిరాజ్‌ను అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. లైవ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చిన సిరాజ్ ప్రదర్శనతో భారత్ మ్యాచ్‌లో తిరుగుబాటు ప్రారంభించిందని అంటున్నారు. ఇదే టెస్టులో బుమ్రా, ఆకాశ్ దీప్‌తో కలిసి సిరాజ్ వేసిన యార్కర్లు, షార్ట్ పిచ్ బంతులు ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాయి.