Sonakshi Sinha : టాలీవుడ్‌లోకి సోనాక్షి సిన్హా గ్రాండ్ ఎంట్రీ.. 'జటాధర' ఫస్ట్ లుక్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి 'సోనాక్షి సిన్హా' త్వరలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు.
ఆమె సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'జటాధర' (Jatadhara) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.
ఈ చిత్రానికి వెంకట్ కల్యాణ్ కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కుతున్న 'బైలింగ్యువల్ ప్రాజెక్ట్' కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సోనాక్షి ఫస్ట్ లుక్ విడుదల!
అయితే, ఇటీవల ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
తాజాగా వుమెన్స్ డే సందర్భంగా మేకర్స్ ఈ వార్తలను నిజం చేస్తూ 'సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్'ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ఆమె శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టమైంది.
Details
మైథాలాజికల్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్
'జటాధర' సినిమా మైథాలాజికల్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.
ఇందులో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాను జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కె.ఆర్. భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారేమో అనేది వేచి చూడాలి.