Page Loader
The Rajasaab : ప్రభాస్ 'ది రాజా సాబ్' క్లైమాక్స్ షూట్ కోసం అద్భుతమైన మహల్ సెట్
ప్రభాస్ 'ది రాజా సాబ్' క్లైమాక్స్ షూట్ కోసం అద్భుతమైన మహల్ సెట్

The Rajasaab : ప్రభాస్ 'ది రాజా సాబ్' క్లైమాక్స్ షూట్ కోసం అద్భుతమైన మహల్ సెట్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2024
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

'సలార్‌', 'కల్కి 2898 AD' చిత్రాల విజయం తర్వాత, డార్లింగ్ ప్రభాస్‌ నటించే చిత్రం 'ది రాజాసాబ్' ప్రేక్షకుల అంచనాలు మరింత పెంచింది. కమర్షియల్ చిత్రాల దర్శకుడు మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు, కాగా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మారుతి టీమ్‌ కష్టపడి పని చేస్తోంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వివరాలు 

80శాతం మేర పూర్తయిన సినిమా షూటింగ్ 

'ది రాజాసాబ్'కు సంబంధించిన అన్ని వార్తలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. తాజా వార్తల ప్రకారం, వచ్చే షెడ్యూల్‌లో క్లైమాక్స్ సీక్వెన్స్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఓ మహల్ సెట్‌ కూడా నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సెట్‌లోనే 'ది రాజాసాబ్' క్లైమాక్స్ సీక్వెన్స్‌ని షూట్ చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్ర షూటింగ్ నిరంతరంగా కొనసాగుతోంది, ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది అని చిత్ర యూనిట్ మూడు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది.