Sree Leela: శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ.. ఫస్ట్ సాంగ్ రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగమ్మాయి శ్రీలీల తన సినీ ప్రయాణాన్ని కన్నడ పరిశ్రమలో ప్రారంభించింది. అక్కడ సత్తా చాటిన ఆమె, ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకెళ్లుతోంది.
క్రేజీ ప్రాజెక్టులను సొంతం చేసుకుంటూ యంగ్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తోంది. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాల్లో ఫస్ట్ ఛాయిస్ అవుతుండటంతో, కొంతమంది కో యాక్ట్రెస్‌లు ఈ విషయంలో అసూయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం శ్రీలీల క్రేజ్ తెలుగులో తారాస్థాయికి చేరింది. ఆమె చేతిలో 'రాబిన్ హుడ్', 'మాస్ జాతర', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.
అంతేకాదు తమిళ పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది. సుధా కొంగర దర్శకత్వంలో వస్తోన్న 'పరాశక్తి'లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మేడమ్ లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
Details
దీపావళి కానుకగా రిలీజ్
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే, 'పుష్ప 2' ద్వారా శ్రీలీలకు అక్కడ గట్టి గుర్తింపు వచ్చింది.
దీంతో, హిందీ చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెంచింది.
ఇటీవల సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్‌తో ఫోటోలకు ఫోజులిస్తూ, బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, 'భూల్ భూలయ్యా 3'తో ఘన విజయం అందుకున్న కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల నటించనుంది.
అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించినా మేకర్స్ ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమా టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తుండగా, దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.