Chiranjeevi-Sreeleela: 'విశ్వంభర' సెట్లో శ్రీలీల సందడి.. చిరంజీవి చేతుల మీదుగా ప్రత్యేక కానుక
ఈ వార్తాకథనం ఏంటి
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'విశ్వంభర' సెట్లో నటి శ్రీలీల సందడి చేశారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, చిరంజీవి ఆమెకు ప్రత్యేక గౌరవం అందించారు. వెండి వర్ణంలో ఉన్న శంఖాన్ని ప్రత్యేక కానుకగా ఆమెకు అందజేశారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీలీల తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కొన్ని ఫొటోలు పంచుకున్నారు.
"విత్ ఓజీ.. వెండితెరపై మనం ఎంతో ఆదరించే మన శంకర్‌దాదా ఎంబీబీఎస్. మహిళా దినోత్సవం సందర్భంగా అందించిన ప్రత్యేక కానుక. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. రుచికరమైన భోజనానికి ప్రత్యేక థ్యాంక్స్," అంటూ శ్రీలీల రాసుకొచ్చింది.
Details
హీరోయిన్ గా త్రిష
సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
చిరంజీవి గత చిత్రాలకంటే అత్యున్నత సాంకేతికతతో రూపొందుతున్న ఈ సినిమా, దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
యు.వి. క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఇక, 'విశ్వంభర' సెట్లో శ్రీలీల కనిపించడంతో, ఆమె కూడా సినిమాలో భాగమా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.