Page Loader
Dadasaheb Phalke Awards: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 ప్రకటన : పూర్తి విజేతల జాబితా ఇదే 
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 ప్రకటన

Dadasaheb Phalke Awards: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 ప్రకటన : పూర్తి విజేతల జాబితా ఇదే 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 21, 2024
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అవార్డుల వేడుకల్లో ఒకటైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024, ఫిబ్రవరి 20న ముంబైలో జరిగింది. ఈ అవార్డు వేడుకకు కరీనా కపూర్ ఖాన్, రాణి ముఖర్జీ, షాహిద్ కపూర్, షారూఖ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. 'జవాన్' మూవీకి షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డు రాగా, ఇక అదే సినిమాకి హీరోయిన్‌ నయనతార 'ఉత్తమ నటి' అవార్డును అందుకుంది. తెలుగు సినిమా యువ దర్శకుడు 'సందీప్‌ వంగా' 'యానిమల్‌' సినిమాకి గాను ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన ఈ అవార్డుల వేడుకలో సినీసెలబ్రిటీలు సందడి చేశారు.

Details 

విజేతల పూర్తి జాబితా ఇదే.. 

బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ - బాబీ డియోల్ ఉత్తమ దర్శకుడు - సందీప్ రెడ్డి వంగా (యానిమల్ ) ఉత్తమ నటి - నయనతార (జవాన్) ఉత్తమ నటుడు(క్రిటిక్స్)- వీక్కీ కౌశల్ (సామ్ బహుదూర్) ఉత్తమ నటుడు - షారుఖ్ ఖాన్ (జవాన్) ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (మేల్)గా వరుణ్‌ జైన్‌ ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (ఫీమేల్)గా శిల్పా రావు ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ అవార్డు యేసుదాసు ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్ మౌషుమీ ఛటర్జీ

Details 

రూ.800 కోట్లకు పైగా వసూలు చేసిన యానిమల్

రణబీర్ కపూర్,రష్మిక మందన్న,అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ చిత్రానికి గాను బాబీ డియోల్ బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ అవార్డును గెలుచుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ కమర్షియల్ విజయం సాధించడంతో బాటు ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు ఈచిత్రానికి గానూ సందీప్ వంగా త్తమ దర్శకుడు అవార్డును కైవసం చేసుకున్నాడు. జవాన్ సినిమాకి గాను నయనతార ఉత్తమ నటి,షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డులు గెలుచుకున్నారు. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషించారు. 2023లో షారుఖ్ ఖాన్ విడుదలైన మూడు చిత్రాలలో పఠాన్,డుంకీ కాకుండా జవాన్ ఒకటి.

Details 

టెలివిజన్‌,వెబ్‌సిరీస్‌విజేతలు వీరే 

చివరగా, సామ్ బహదూర్ చిత్రానికి గాను విక్కీ కౌశల్ ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును అందుకున్నాడు. భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇక టీవీ విభాగం విషయానికి వస్తే టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌‌గా 'ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌' నిలిచింది. ఉత్తమ నటుడిగా 'నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌), ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ (అనుపమ) అవార్డులు అందుకున్నారు. ఇక వెబ్‌సిరీస్‌ విభాగంలో క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్‌) నిలిచారు.