Page Loader
Ramcharan: రామ్ చరణ్ ని 'ఇడ్లీ వడా' అన్న షారుఖ్ ఖాన్..మండిపడుతున్న ఫాన్స్ 
రామ్ చరణ్ ని 'ఇడ్లీ వడా' అన్న షారుఖ్ ఖాన్..మండిపడుతున్న ఫాన్స్

Ramcharan: రామ్ చరణ్ ని 'ఇడ్లీ వడా' అన్న షారుఖ్ ఖాన్..మండిపడుతున్న ఫాన్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2024
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశం, ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, రిహన్నా, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రామ్ చరణ్, రాణి ముఖర్జీ, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, కరీనా కపూర్ తదితరులు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుండి కేవలం రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందింది. అలా రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో అక్కడికి వెళ్లారు.

Details

నాటు నాటు హుక్ స్టెప్ కి ప్రయత్నించిన ఖాన్ త్రయం

ప్రి వెడ్డింగ్ రెండవ రోజు, బాలీవుడ్ స్టార్స్ అయినా ఖాన్ త్రయం అంటే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్,అమీర్ ఖాన్ లు కూడా వచ్చారు. ఈ ముగ్గురూ మొదట రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ RRR పాట నాటు నాటు హుక్ స్టెప్ చేయడానికి ప్రయత్నించారు. ఒకానొక సమయంలో, వారందరూ కలిసి పాటకు హుక్ స్టెప్ వేయడంతో రామ్ చరణ్ కూడా వేదికపైకి వచ్చారు. రామ్‌ని షారూఖ్ ఖాన్ వేదికపైకి ఆహ్వానించారు. అయితే స్టేజ్ మీదికి రామ్ చరణ్ ని పిలిచే సమయంలో షారుక్ ఖాన్"ఇడ్లీ వడా"అంటూ పిలిచారట. దీనికి సంబంధించిన వీడియోను పింక్‌విల్లా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రామ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్ ఈ విషయమై అసహనం వ్యక్తం చేశారు.

Details

షారుఖ్ ని 'వడా పావ్'అని పిలుస్తే ఊరుకుంటారా

"నేను SRK అభిమానిని, కానీ రామ్ చరణ్‌ని వేదికపై పిలిచిన విధానం నాకు నిజంగా నచ్చలేదు" అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పింది. అయితే ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో షారుఖ్ రామ్‌ చరణ్ ని'ఇడ్లీ వడా' అని పిలవడం పట్ల ఫైర్ అవుతున్నారు. 'రామ్ చరణ్‌ను'ఇడ్లీ వడా' అని సంబోధించడం ద్వారా షారుక్ ఖాన్ షారుక్ ఖాన్ కి ఇంకా టాలీవుడ్ పై చులకన భావం ఉందని మండిపడుతున్నారు. అంతేకాదు మిమ్మల్ని'వడా పావ్'అని పిలుస్తే ఊరుకుంటారా అని కామెంట్లు పెడుతున్నారు. మరి షారుక్ ఖాన్ రామ్ చరణ్ ని'ఇడ్లీ వడా'అని సరదాగా పిలిచినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం దీన్ని తీసుకోలేకపోయారు.మరి దీనిపై షారుఖ్ అభిమానులకు ఎలా క్లారిటీ ఇస్తాడో చూడాలి.