Page Loader
Tollywood Movies: ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మూడు సినిమాలు
ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మూడు సినిమాలు

Tollywood Movies: ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మూడు సినిమాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2024
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కాలంలో కొన్ని బ్యానర్లు వరుసగా సినిమాలను తీస్తూ ఆకట్టుకుంటున్నాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా, ఒకేసారి రెండు లేదా మూడు చిత్రాలను విడుదల చేసేందుకు ముందుకొస్తున్నాయి. అలాంటి బ్యానర్లలో ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ ఒకటి. ఇప్పటి వరకు ఈ బ్యానర్ విడుదల చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. అయినప్పటికీ, ఈ బ్యానర్ వరుసగా సినిమాలు తీస్తూనే ఉంది. కొంతమంది నిర్మాతలు ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో నష్టాలను ఎదుర్కొన్నా, సినిమాలు చేస్తూనే ఉన్నారు.

వివరాలు 

బ్యానర్ నుండి విడుదలకు మూడు సినిమాలు 

టాలీవుడ్‌లో, ప్రొడక్షన్ కంపెనీలు తమ సినిమాలను విడుదల చేసేందుకు ఎంత కష్టపడతాయో అందరికి తెలిసిన విషయమే. కానీ, ఒకే నెలలో పలు సినిమాలను విడుదల చేసి తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ . ప్రస్తుతం, ఈ బ్యానర్ నుండి మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 'మట్కా' చిత్రం నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని పీరియాడిక్ థ్రిల్లర్‌గా ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. అదే సమయంలో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న 'మెకానిక్ రాకీ' చిత్రం నవంబర్ 22న గ్రాండ్ విడుదలకు సిద్ధం అవుతుంది.

వివరాలు 

జీ5 ఓటీటీలో 'వికటకవి'

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల మధ్య విడుదల కానున్నాయి. ఇక ఈ సినిమాలతో పాటు 'వికటకవి' అనే చిత్రాన్ని జీ5 ఓటీటీలో నవంబర్ 28న విడుదల చేయనున్నారు ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇలా ఒకే నెలలో మూడు సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్, నవంబర్‌లో సాలిడ్ హిట్స్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అవకాశంతో ఎస్ఆర్‌టి బ్యానర్ కు మంచి కాలం ప్రారంభమవుతుందో చూడాలి.