Page Loader
Rajamouli-Rama Dance: రాజమౌళి, రమ డ్యాన్స్‌ రిహార్సల్‌ వీడియో వైరల్‌! 
రాజమౌళి, రమ డ్యాన్స్‌ రిహార్సల్‌ వీడియో వైరల్‌!

Rajamouli-Rama Dance: రాజమౌళి, రమ డ్యాన్స్‌ రిహార్సల్‌ వీడియో వైరల్‌! 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2024
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకధీరుడు SS రాజమౌళి,తన సతీమణి రమతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకలో డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. హీరో, డాన్స్ కొరియోగ్రాఫర్,దర్శకుడు ప్రభుదేవా ఆల్‌టైమ్‌ హిట్స్‌లలో ఒకటైన 'అందమైన ప్రేమ రాణి' పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. ఇప్పుడు, ఈ డాన్స్‌కు సంబంధించిన రిహార్సల్‌ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, రాజమౌళి,అయన భార్య రమ కొంతమంది బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లు, కొరియోగ్రాఫర్‌తో కలిసి తమ స్టెప్పులను ప్రాక్టీస్ చేయడాన్ని చూడవచ్చు. ఈ వీడియో లో అందరిలోకెల్లా రాజమౌళి స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో క్లిప్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రాజ‌మౌళి మామూలోడు కాదంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Details

మహేశ్‌ బాబు సరసన ఇండోనేషియా నటి

మైత్రి మూవీ మేకర్స్‌ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహంలో రాజమౌళి దంపతులు డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. వర్క్ ఫ్రంట్‌లో, SS రాజమౌళి మహేష్ బాబుతో తన రాబోయే చిత్రం 'SSMB 29' ప్రీ-ప్రొడక్షన్‌పై పని చేస్తున్నారు. ఈ చిత్రం 2024 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. త్వరలో, మేకర్స్ మిగిలిన తారాగణం, సిబ్బందిని ఖరారు చేసి, దానిని ప్రకటిస్తారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ మహేశ్‌ బాబు సరసన నటిస్తున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..