Page Loader
NTR: జపాన్ లో 'ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' విడుదల.. ఎన్టీఆర్‌ను ప్రశంసించిన రాజమౌళి
ఎన్టీఆర్‌ను ప్రశంసించిన రాజమౌళి

NTR: జపాన్ లో 'ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' విడుదల.. ఎన్టీఆర్‌ను ప్రశంసించిన రాజమౌళి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) నటనను దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలతో ముంచెత్తారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' అనే డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రచార కార్యక్రమం కోసం జపాన్‌కు వెళ్లిన రాజమౌళి, అక్కడి మీడియాలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ అద్భుతమైన నటనను కొనియాడారు. ప్రత్యేకంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలోని 'కొమురం భీముడో' పాటను ప్రస్తావిస్తూ ఆయన అనుభవాలను పంచుకున్నారు.

వివరాలు 

'కొమురం భీముడో' పాట చిత్రీకరణ ఒక పెద్ద సవాలే

''కొమురం భీముడో' పాట చిత్రీకరణ ఒక పెద్ద సవాలే. అయితే, ఆ పాటను చిత్రీకరించడంలో నాకు అంత సులభంగా అనిపించిందంటే,అందుకు కారణం తారక్‌ (ఎన్టీఆర్‌).అతని నటనను గురించి ప్రపంచమే తెలుసు. కానీ ఆ పాటలో ఆయన ప్రదర్శించిన హావభావాలు అసాధారణ స్థాయిలో ఉంటాయి. తారక్‌ తన శరీరంలోని ప్రతి భాగంతో భావోద్వేగాన్ని పలికించాడు. నేను కెమెరాను అతడి ముఖంపై నిలిపి పాటను ప్లే చేశాను. అంతే, అద్భుతమైన ఫలితం వచ్చింది. ఆ పాట విజయవంతం కావడంలో కొరియోగ్రాఫర్‌ పాత్ర కూడా చాలా కీలకం. తారక్‌ను ఎలా కదిలించాలి, ఎలా తూగించాలి అన్నదానిపై కొరియోగ్రఫీ పక్కా ప్రణాళికతో జరిగింది'' అని రాజమౌళి వెల్లడించారు.

వివరాలు 

ఆగస్టు 14న 'వార్‌ 2' విడుదల

'ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' అనే డాక్యుమెంటరీ ఇప్పటికే నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. ఇక ఇప్పుడు అదే డాక్యుమెంటరీ జపాన్‌ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన ప్రతిభను చాటేందుకు అడుగులు వేస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న 'వార్‌ 2' సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల దశలో ఉంది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయాలని యూనిట్‌ ఏర్పాట్లు చేస్తున్నది.