Page Loader
SSMB29: మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ప్రత్యేక తరగతులు.. ఎందుకో తెలుసా..?
మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ప్రత్యేక తరగతులు.. ఎందుకో తెలుసా..?

SSMB29: మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ప్రత్యేక తరగతులు.. ఎందుకో తెలుసా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్‌.ఎస్.రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి రాబోతున్న చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29). గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి ప్రాంచైజీ, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా 2025లో సెట్స్‌పైకి రానున్న నేపథ్యంలో, ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఎస్‌ఎస్ రాజమౌళి ఈ సినిమాకు మొదటిసారి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించబోతున్నట్లు సమాచారం.

వివరాలు 

ఏఐ టెక్నాలజీ ప్రత్యేక తరగతులకు  జక్కన్న 

జక్కన్న సినిమా అంటే సాధారణంగా వీఎఫ్‌ఎక్స్ హైరేంజ్‌లో ఉంటుందన్న అందరికి తెలిసిందే. కానీ ఈ సారి ఏఐని విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, జక్కన్న ప్రత్యేక తరగతులకు కూడా హాజరవుతున్నాడట. సినిమాలోని కొన్ని పాత్రలు, జంతువులను సృష్టించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించబోతున్నాడని ఇన్‌సైడ్ టాక్. ఈ చిత్రంలో జక్కన్న ఎలా మ్యాజిక్ చేయబోతున్నాడో అన్నది అందరికి ఆసక్తి కలిగిస్తుంది.

వివరాలు 

2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల

ఈ సినిమా ఒక ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా, ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్నది. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్‌తో పాటు వివిధ భాషల నటీనటులు కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. జక్కన్న టీం ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని భావిస్తోంది.