Page Loader
SSMB 29: మహేష్ - రాజమౌళి సినిమా అప్డేట్.. డిసెంబరు నుండి రెగ్యులర్ షూటింగ్
మహేష్ - రాజమౌళి సినిమా అప్డేట్.. డిసెంబరు నుండి రెగ్యులర్ షూటింగ్

SSMB 29: మహేష్ - రాజమౌళి సినిమా అప్డేట్.. డిసెంబరు నుండి రెగ్యులర్ షూటింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 06, 2024
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా వెండితెరపై అరంగేట్రం చేసి, పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ అనే బిరుదు సంపాదించుకొని, టాప్ స్టార్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మహేశ్ తన కెరీర్ లో 29వ చిత్రంలో నటించబోతున్నారు, ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాత్ర కోసం మహేశ్ బాబు తన లుక్ లో మార్పులు చేస్తూ,బాడీ షేప్, గడ్డం పెంచుకునే పనిలో ఉన్నారు. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు లో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని అభిమానులు ఆశించారని,కానీ ఆ తేదీన ఎలాంటి అప్‌డేట్ అందక అభిమానులు నిరాశ చెందినట్టు సమాచారం.

వివరాలు 

సినిమా పేరు  GOLD 

అయితే, తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా SSMB29 పై ఏదో ఒక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల చివర్లో యూనిట్ సభ్యులు వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి షెడ్యూల్‌ను విదేశాల్లోని అడవుల్లో భారీ చేజింగ్ సీన్స్ చిత్రీకరణతో ప్రారంభించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి GOLD అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మహేశ్ సరసన హీరోయిన్ ఎవరు, అలాగే ప్రతినాయకుడి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారన్న విషయాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహేష్ - రాజమౌళి సినిమా అప్డేట్