Page Loader
SSMB 29: నా చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేయొద్దు.. నిర్మాతలను కోరిన మహేశ్ బాబు
నా చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేయొద్దు

SSMB 29: నా చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేయొద్దు.. నిర్మాతలను కోరిన మహేశ్ బాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2024
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. దీనిని '#SSMB29'గా ప్రచారంలో ఉంచారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అధికారిక అప్‌డేట్స్ రానప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు 

బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించేందుకు మహేశ్ బాబు రెడీ  

మహేష్ బాబు తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. రాజమౌళి ప్రాజెక్ట్‌ ద్వారా మహేశ్ పాన్‌ వరల్డ్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్‌లో ఈ సినిమా ద్వారా హిందీ ప్రేక్షకులను పలకరించేందుకు మహేశ్ బాబు రెడీ అవుతున్నారు. అందుకే '#SSMB29' విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీలో డబ్ చేసి థియేటర్‌లలో విడుదల చేయవద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు ఇప్పటివరకు నేరుగా ఏ హిందీ సినిమాలోనూ నటించలేదు, కాబట్టి బాలీవుడ్‌లో ఇది అతని తొలి సినిమా అవుతుంది. అందుకే హిందీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

అప్‌డేట్స్ కోసం  అభిమానుల ఆసక్తి 

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండగలు, సినిమా యూనిట్ సభ్యుల పుట్టిన రోజులు వచ్చినప్పుడల్లా ఏదైనా అప్‌డేట్ ఇస్తారేమో అని ఆశపడ్డారు. కానీ, రాజమౌళి మాత్రం సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయటపడకుండా ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు (SSMB29 అప్‌డేట్). ప్రతీ సన్నివేశం పర్‌ఫెక్ట్‌గా రావాలని అనుకుంటూ విరామం లేకుండా పనిచేస్తున్న జక్కన్న, ఈ ప్రాజెక్ట్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టారట. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) తరువాత చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కువగా ఉండటంతో ప్రతి అంశం చాలా కచ్చితంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

లోకేషన్లు, నటీనటుల ఎంపికలో రాజమౌళి జాగ్రత్త 

లోకేషన్లు, నటీనటుల ఎంపిక వంటి విషయాల్లో రాజీ పడకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా SSMB 29 అప్‌డేట్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సంవత్సరం చివరికి సినిమాకు సంబంధించిన పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక అప్‌డేట్ రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజమౌళికి తన సినిమాల గురించి ప్రెస్ మీట్ పెట్టి అప్‌డేట్స్ ఇవ్వడం అలవాటు. మహేశ్ మూవీ విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించాలని అనుకుంటున్నారు. ఇక మహేశ్‌ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఈ సినిమా నుంచి ఏదైనా చిన్న అప్‌డేట్ వస్తే చాలా సంతోషపడతారు.

వివరాలు 

 భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లో.. 

అమెజాన్ అడవుల నేపథ్యంలో ఉండే ఈ కథలో కొందరు విదేశీ నటులు కూడా నటించనున్నారు. ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లో కూడా అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై మహేశ్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన ఇప్పటికే సన్నద్ధమయ్యారు.