Page Loader
Steppamaar: ఊరలో ఊర మాస్ సాంగ్ తో ఊపేస్తున్న డబుల్ ఇస్మార్ట్ 
Steppamaar: ఊరలో ఊర మాస్ సాంగ్ తో ఊపేస్తున్న డబుల్ ఇస్మార్ట్

Steppamaar: ఊరలో ఊర మాస్ సాంగ్ తో ఊపేస్తున్న డబుల్ ఇస్మార్ట్ 

వ్రాసిన వారు Stalin
Jul 01, 2024
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ పోతినేని (Ram Pothineni) టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌ డబుల్ ఇస్మార్ట్‌ (Double iSmart).పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ పాటలతో యూత్ ని ఉర్రూతులూగించిన గేయ రచయిత భాస్కర భట్ల తన మార్కు మరో సారి చూపారు. ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్నడబుల్ ఇస్మార్ట్ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ STEPPAMAAR ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. మేకర్స్‌ చెప్పినట్టుగానే మాస్‌ సాంగ్‌ అఫ్ ది ఇయర్‌గా ఈ పాట నిలవనుందని తాజా విజువల్స్‌తో క్లారిటీ ఇచ్చేస్తుంది పూరీ టీం.

వివరాలు 

ఇప్పటికే ప్రమోషన్స్‌ షురూ

దద్దరిల్లిపోయే మ్యూజిక్,దడ దడ లాడునున్న ధియేటర్లు మాస్‌ మ్యూజిక్‌ జాతర ఉండబోతుంది.. వేచి ఉండండి.. అంటూ డబుల్‌ ఇస్మార్ట్‌ గెటప్‌లో స్టైలిష్‌గా నడుచుకుంటూ వెళ్తున్న రామ్‌ లుక్‌తో ఇప్పటికే ప్రమోషన్స్‌ షురూ చేశారు మేకర్స్‌. ఇస్మార్ట్‌ శంకర్‌కు స్పీకర్‌ దద్దరిల్లిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి అదిరిపోయే ఆల్బమ్‌ రెడీ చేసినట్టు తాజా సాంగ్‌తో అర్థమైపోతుంది. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం,హిందీ, కన్నడ,మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ధిమాక్కిరికిరి డబుల్‌ ఇస్మార్ట్‌ అంటూ ఇప్పటికే లాంచ్‌ చేసిన టీజర్‌ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Embed