
Stree2: ఓటిటిలోకి హారర్ కామెడీ 'స్ట్రీ 2'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల విడుదలైన "స్త్రీ2" చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది.
బాలీవుడ్ నటులు శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, పండుగ విడుదలతో రికార్డులు సృష్టించి, మంచి వసూళ్లను రాబట్టింది.
ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతూ, "స్త్రీ2" ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం, ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా అద్దె ప్రాతిపదికన (రూ. 349) అందుబాటులో ఉంది.
అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. దాదాపు రూ. 500 కోట్ల వసూళ్లు అందించింది.
వివరాలు
'సర్కట'తో కొత్త సమస్య
2018లో విడుదలైన "స్త్రీ"కి ఇది సీక్వెల్. హారర్ కామెడీ తరహాలో రూపొందించిన "స్త్రీ2" ఆగస్టు 15న బాక్సాఫీసుకు వచ్చింది.
చందేరీ గ్రామంలో "స్త్రీ" సమస్య పరిష్కరించిన అనంతరం, 'సర్కట'తో కొత్త సమస్య మొదలవుతుంది.
గ్రామంలో ఆధునిక మహిళలను సర్కట ఇబ్బందులు కలిగిస్తాడు. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (అపర్ శక్తి) శ్రద్ధా కపూర్ కలిసి ఎలా ఎదుర్కొంటారో ఈ చిత్రంలో చూడవచ్చు.
"స్త్రీ2" మంచి వినోదంతో పాటు ఆద్యంతం ఆసక్తికరమైన కథనాన్ని అందించింది.