Page Loader
Nishad Yusuf: 'కంగువా' ఎడిటర్ నిషాద్ యూసఫ్‌ ఆకస్మిక మరణం.. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం
'కంగువా' ఎడిటర్ నిషాద్ యూసఫ్‌ ఆకస్మిక మరణం.. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం

Nishad Yusuf: 'కంగువా' ఎడిటర్ నిషాద్ యూసఫ్‌ ఆకస్మిక మరణం.. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2024
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసఫ్ (43) ఆకస్మికంగా కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన తన కొచ్చిలోని నివాసంలో విగతజీవిగా కనిపించారు. ఈ విషాద ఘటనతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి, మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. నిషాద్ సినీ కెరీర్‌లో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సూర్య నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కంగువా'కు ఎడిటర్‌గా పనిచేయగా, 2022లో విడుదలైన 'తల్లుమాల' సినిమాకి ఉత్తమ ఎడిటింగ్ అవార్డును కేరళ రాష్ట్రం నుంచి అందుకున్నారు.

Details

బాజూకా లో ఎడిటర్ గా పనిచేసిన నిషాద్

ప్రస్తుతం మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'బాజూకా' సినిమాలో కూడా నిషాద్ ఎడిటర్‌గా పనిచేశారు. నిషాద్ మరణం సినీ వర్గాలను శోకసంద్రంలో ముంచేసింది. ఆయన మరణవార్తను ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ డైరెక్టర్స్ యూనియన్ అధికారికంగా ప్రకటిస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. నిషాద్ యూసఫ్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.