
Anaganaga: ఓటీటీలోకి అడుగుపెట్టిన సుమంత్ 'అనగనగా'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈటీవీ విన్ ఒరిజినల్ చిత్రం 'అనగనగా' (Anaganaga) స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటించారు.
ఈ సినిమాను మే 8వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఈ చిత్రంలో సుమంత్ ఓ ఉపాధ్యాయుడిగా కనిపించనున్నాడు. విద్యా రంగంలో నెలకొన్న లోపాలను ఎత్తిచూపిస్తూ, చిన్నారులకు బోధన ఎలా ఉండాలి అనే అంశాన్ని ఆకట్టుకునేలా ప్రస్తావించేలా ఈ కథ సాగుతుంది.
Details
ఇన్‌ఫోరమేటివ్ డ్రామాగా 'అనగనగా'
కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే.. మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టకూడదని, కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటే మార్కులు తానే వస్తాయన్నది కథానాయకుడి విశ్వాసం.
తన అభిప్రాయాలను అమలు పరచడంలో ఆ ఉపాధ్యాయుడు ఎంతవరకు విజయవంతం అయ్యాడు? జీవితంలో అతడికి భార్య ఎంత మద్దతుగా నిలిచింది? వారి కుమారుడు ఎలాంటి ఫలితాలు సాధించాడు?
అనే ఆసక్తికర అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది.